గ్రామాలను అనుసంధానం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, మార్చి 26 ( విజయక్రాంతి) : వనపర్తి నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించేందుకు వనపర్తి ఆర్టిసి డిపోకు కొత్తగా 20 ఆర్టీసీ బస్సులు కావాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. గురువారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ హాల్ 1 లో నిర్వహించినా ప్రత్యేక సమావేశంలో పలువురు ఎమ్మెల్యే లు ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో బస్టాండ్ వైపు రోడ్డులో డిపో గోడలకు అనుసంధానంగా ఉన్న చిరు వ్యాపార సముదాయాలను, వెనకాలకు జరిపి కట్టుకునే విధంగా చేసి రోడ్డు వెడల్పుకు ఆర్టీసీ డిపో యాజమాన్యం సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 20 ఎకరాలలో కొత్త బస్ డిపో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత డిపో స్థలంలో పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తి పట్టణంలో రెండు మినీ బస్సులను (సిటీ బస్సు మాదిరిగా) ఏర్పాటు చేయాలని దీంతో వనపర్తి లోని విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.
పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వయా యాపర్ల గుమ్మడం, గుమ్మడం తండా, చిన్న గుమ్మడం కలుపుతూ ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, వనపర్తి నుంచి వయా మానాజిపేట్ మహబూబ్నగర్కు నాలుగు ట్రిప్పులు అదనంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వనపర్తి - పెద్దమందడి మండల కేంద్రానికి షటిల్ బస్ ఏర్పాటు చేసి రోజు పది ట్రిప్పులు తిరిగేలా చూడాలన్నారు.
రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి నూతన భవన నిర్మాణం కోసం అప్పయ్యపల్లి దగ్గర కేటాయించిన స్థలంలో వెంటనే కార్యాలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేకోరారు. అదేవిధంగా వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో నిర్మించనున్న సీసీ బెడ్ లకు సంబంధించి వనపర్తి బస్టాండ్ కు 2.50 కోట్లు మంజూరు అయి ఉన్నాయని, అదేవిధంగా పెబ్బేరు బస్టాండ్ లోని cc బెడ్ నిర్మాణా నికి రూ. 1. 20 కోట్ల రూపాయలు మంజూరై ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.




