కేంద్ర మంత్రి గీతాలాపన
27-03-2026 12:26 AM
ముకరంపుర, మార్చి 26 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాయకుడి అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి శత వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాలను ఆలపించారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న బండి సంజయ్.. ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో బండి సంజయ్ గీతాలాపన ప్రోమో హల్ చల్ చేస్తోంది. శ్రీ రామ నవమి సందర్భంగా కరీంనగర్‌లో బండి సంజయ్ పాడిన పాటలను అధికారికంగా విడుదల చేయనున్నారు.




