04-12-2025 12:33:23 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రధాని మోదీని, ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని, కానీ ఈ భేటీలో రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని వారితో సీఎం ఎందుకు చర్చించలేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెం చాలని రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం ఆమోదించి, రాష్ట్రపతి, గవర్నర్లకు పంపించినట్టుగానే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందున ఈ సమయంలోనే బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదన్నారు.
ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదనడానికి సీఎం ఢిల్లీ పర్యటనే నిదర్శనమన్నారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని విన్నవించకపోవడం దు ర్మార్గమని అన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో కూడా పార్లమెంటును స్తంభింప చేయాలని, బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కోసం పోరాటం చేయాలని కోరకపోవడం దురదృష్టకరమన్నారు.
బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం మూలంగా, అలా గే ఆ పార్టీ లోపకాయికరణతోనే బీసీ రిజర్వేషన్లపై బీజేపీని నిలదీయడం లేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీల కపటనాటకాన్ని బీసీ సమాజం గమని స్తున్నదని, బీసీలపై వారు సాగిస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు బీసీ సమాజం ఎండ గట్టి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.