2 April, 2026 | 3:20 AM

7న ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణ

02-04-2026 12:03 AM
  1. ప్రభుత్వాన్ని కలిసి సమస్యలు వివరిస్తాం
  2. టీఎంయూ ఆర్టీసీ యూనియన్ నేత అశ్వద్ధామరెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వివరిస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 7వ తేదీన సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని టీఎంయూ ఆర్టీసీ యూనియన్ నాయకులు అశ్వద్ధామరెడ్డి తెలిపారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అశ్వద్ధామరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది ఆర్టీసీ యూనియన్ నాలయకుల సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

బస్ భవన్‌లోని ఏ బ్లాక్ ఫోర్త్ ఫ్లోర్‌ను జీఎస్టీ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఇతర యూనియన్లు కూడా కలిసి రావాలని టీఎంయూ-అశ్వద్ధామరెడ్డి, ఎన్‌ఎంయూ మర్రి నరేందర్, టీజేఎంయూ-ప్రేమ్ నాద్, సీఐటీయూ-రవీందర్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ-అబ్రహం, బీఎంఎస్-మనోహర్ కులకర్ణి, ఎస్‌టీఎంయూ-పున్న హరికిషన్, బీఆర్‌టీయూ-వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.