2 April, 2026 | 3:16 AM

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి

02-04-2026 12:03 AM

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు, ఏప్రిల్ 1 : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆసుపత్రి లోని వార్డును, పరిసరాలను, క్షుణ్ణంగా పరిశీలించారు, ఆసుపత్రి లో ఎంత మంది పనిచేస్తున్నారని, సిబ్బంది సంఖ్య, వారి హాజరు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రతి సిబ్బంది విధిగా విధులకు హాజరు నమోదు చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని డైలీ అటెండెన్స్ లాగిన్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ప్రతి రోజు ఓపి (ఓ పి) కి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని, ఆసుపత్రి లో అవసరమైన ఔషధాలు సరిపడా ఉన్నాయా లేదా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య అధికారి మనోహర్, తాసిల్దార్ వి. ఆంజనేయులు, వైద్యఅధికారులు, సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.