3 May, 2026 | 11:10 AM

కార్యకర్తలకు అండగా ఉంటాం

26-06-2024 12:02 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు   వేం నరేందర్‌రెడ్డి

గజ్వేల్, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ఆధ్వర్యంలో గజ్వేల్‌కు చెందిన పలువురు నాయకులు మంగళవారం నరేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. పార్టీకోసం పనిచేసే వారికి అన్యా యం జరగబోదన్నారు. నామినేటేడ్ పదవులు ఇచ్చి కార్యకర్తలను ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం నాయకులు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబును వారి నివాసాల్లో వేర్వేరుగా కలిశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధిపై వారితో చర్చించారు.