12 August, 2026 | 9:19 AM

Breaking News

దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి   •   సీజనల్ వ్యాధుల వైద్యుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడేగం సర్పంచ్   •   లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం   •   ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ బి శ్రీధర్‌ రావు నియామకం   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జేడీ ఆకస్మిక సందర్శన   •   ప్రభుత్వ స్థలం కోసం వ్యాపారుల జగడం!   •   బెజ్జుర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి   •   మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం   •  

రన్ ఫర్ వందేమాతరం

12-08-2026 12:58 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి): వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూ ర్తి చేసుకున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో రన్ ఫర్ వందేమాతరం ర్యాలీని మంగళవారం నిర్వహించారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎన్సీఆర్ గార్డెన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి శక్తి దేశ శక్తి అని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులు అన్నారు. వందేమాతరం లాంటి దేశభక్తి గీతాలు భా రత స్వాతంత్రోద్యమంలో ప్రజలలో స్ఫూర్తి ని ఐక్యతను నింపాయని, అలాంటి జాతీయ భావాలను నేటి తరానికి  చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు మోహన్ రావు, ప్రాంత సహాయ కార్యదర్శి రమేష్, బజరంగదళ్ నిర్వాహకులు జీవన్, తిరుపతిరెడ్డి, శివ చారి, మహేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.