వృద్ధురాలు అదృశ్యం
మేడిపల్లి, ఆగస్టు 11 (విజయక్రాంతి); మతిస్థిమితం సరిగా లేని వృద్దురాలు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్ల, ద్వారక నగర్ పేస్ - 2, అమ్మ ఆసరా వృద్ధ ఆశ్రమం లో ఉండే లక్ష్మమ్మ (70 ) మతి స్తిమితం సరిగా లేదు, గత నెల 15 తేదీన సయోధ్య షెల్టర్ హోం, మేడ్చల్ నుండి అమ్మ ఆసరా వృద్ధ ఆశ్రమం చెంగిచెర్ల కు పంపించడం జరిగింది.
ఈనెల10.న ఉదయం 06.30 గంటల సమయంలో వృద్దు రాలు ఆశ్రమం నుండి బయటి వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు అని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వృద్ధురాలి ఆచూకి తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు.






