23 April, 2026 | 8:58 AM

శేరిలింగంపల్లిలో 2కే రన్

09-12-2024 12:58 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 8: ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో 2కే రన్ నిర్వహించారు. ఈ రన్‌ను జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రన్ ప్రధాన రహదారి మీదుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ తిరిగి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వరకు సాగింది.

ఈ రన్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రన్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రతిరోజూ ఇలాంటి రన్‌తో పాటు ఎక్సర్‌సైజ్ వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుందని తెలిపారు.