23 April, 2026 | 7:26 AM

అనుమతి రెండు.. కట్టేది అయిదు?

09-12-2024 12:55 AM
  1. శేరిలింగంపల్లిలో అనుమతిలేని భవనాలు
  2. అక్రమ అంతస్తుల నిర్మాణం
  3. కాసులిచ్చి కానివ్వండంటున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట గా తయారయ్యింది పరిస్థితి. ముఖ్యంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్, ఓల్డ్ ఎంఐజీ కాలనీలో కొంత మంది బిల్డర్లు అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనికి తోడు టౌన్ ప్లానింగ్ విభాగంలో డీసీ నుంచి చైన్‌మెన్ వరకు అంతా కొత్తవారే రావడం, వారంతా ఇటీవల జరిగిన తెలంగాణ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విధుల్లో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారు.

గతంలో ఇక్కడ పనిచేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు సదురు బిల్డింగ్ నిర్మాణదారులతో కుమ్మక్కయ్యారనేది బహిరంగ రహస్యం. అందుకే ఇప్పటివరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణంపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా జి ప్లస్ ఫైవ్ అంతకంటే ఎక్కువ అంతస్తులు వేసి, ఎటువంటి సెట్‌బ్యాక్ లేకు న్నా కమర్షియల్ బిల్డింగ్‌లను సెల్లార్లతో నిర్మి స్తూ నిబంధనలను గాలికి వదులుతున్నారు.

అక్రమ కట్టడాలను ప్రా రంభ దశలోనే నియంత్రించాల్సిన అధి కారులు అమ్యామ్యాలకు అలవాటుపడి అటువైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా నూతనంగా వచ్చిన టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ, అనుమతులకంటే మించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.