బధిర విద్యార్థులకు క్విజ్ పోటీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన సేవా ఇన్ ఆక్షన్ సంస్థ ఆధ్రర్యంలో హెలెన్ కెల్లర్ బధిరుల కళాశాలలో బధిర విద్యార్థులకు, ఇంటలెక్చువల్ డిజేబుల్‌లకు ఆదివారం క్విజ్ ఫైనల్ పోటీలు జరిగాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి దాదాపు 80 మంది ప్రత్యేక విద్యార్థులు ఈ క్విజ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్‌టీఎన్ మైండ్ ట్రీ ప్రతినిధి జయరాణి దివాకర్ ముఖ్య అతిథిగా, జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ప్రన్సిపాల్ గణేశ్, జాతీయ బధిరుల సంస్థ అస్టిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి ఈ క్విజ్ పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీలు ప్రత్యేక విద్యార్థుల ఆలోచన శక్తిని, విజ్ఞానాన్ని, మేధాశక్తిని పెంపొందించుటకు ప్రతి రాష్ర్టంలో ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శివ ఇన్ యాక్షన్ ప్రతినిధి డాక్టర్ మంజుల, పఠాన్ ఉమర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






