14 July, 2026 | 6:59 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

ఒకే ఓవర్లో 32 పరుగులు

12-01-2026 01:36 AM

నవీ ముంబై, జనవరి 11 : టీ20 ఫార్మా ట్ అంటేనే బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తుతుంది. ఒకే ఓవర్లో 30 పరుగుల కంటే ఎక్కువ ఈ మధ్యన తరచుగా కనిపిస్తున్నా యి. అయితే కేవలం పురుషుల క్రికెట్‌లో మాత్రమే కాదు ఈ తరహా విధ్వంసం మహిళల క్రికెట్‌లోనూ మొదలైపోయింది. వుమె న్స్ ప్రీమియర్ లీగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గుజరాత్  జెయింట్స్‌కు ప్రాతిని థ్యం వహిస్తున్న ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌పై వి ధ్వంసం సృష్టించింది.

ముఖ్యంగా స్నేహరాణా వేసిన ఆరో ఓవర్లో చుక్కలు చూపిం చింది. ఏకంగా 32 పరుగులు రాబట్టింది. తొలి రెండు బంతులకు 2 ఫోర్లు కొట్టిన సోఫీ డివైన్ తర్వాత వరుసగా నాలుగు సిక్స ర్లు బాదింది. దీంతో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో సోఫీ 42 బంతుల్లో 95 (7 ఫోర్లు, 8 సిక్సర్లు) రన్స్ చేసింది. ఆమె బ్యాటింగ్‌కు స్నేహారాణా డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.