calender_icon.png 12 January, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ షో

12-01-2026 01:37:21 AM

మళ్లీ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్

నవీ ముంబై, జనవరి 11: వుమన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ జె యింట్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరు లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్ లిజెల్లీ లీ 86 (54 బంతు ల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టార్ బ్యాటర్ లారా వోల్వార్ట్ దంచికొట్టడంతో 210 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేసేలా కనిపించింది. అయితే సోఫీ డివైన్ చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ ను గెలిపిం చింది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో సోఫీ డివైన్ ఇన్నింగ్సే హైలెట్. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ కివీస్ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్న హోరెత్తించింది.

కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసింది. స్నేహా రాణా వేసిన ఓ ఓవర్లో ఏకంగా 32 రన్స్ చేసింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ లిజెల్లీ లీ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. షెఫాలీతో కలిసి 41 , వోల్వార్ తో కలిసి 90 పరుగులు జోడించింది. ఆమె ఔటైన తర్వాత వోల్వార్ట్ మెరుపు బ్యాటింగ్‌తో ఢిల్లీని విజయానికి చేరువ చేసింది. చివరి ఓవర్లో విజయం కోసం 7 పరుగులు చేయాల్సి ఉండగా.. సోఫీ డివైన్ కేవలం 2 పరుగులే ఇచ్చి జెమీమా, వోల్వార్ లను ఔట్ చేసింది. గుజరాత్‌కు ఇది వరుసగా రెండో విజయం.