12-01-2026 01:34:17 AM
జురెల్‌కు సెలక్టర్ల పిలుపు
వడోదర, జనవరి 11 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి వన్డేకు ముందురోజు ప్రాక్టీస్ చేస్తుండగా పంత్‌కు గాయ మైంది. స్కానింగ్‌లో మజిల్ టియర్‌గా తేలడంతో బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేర కు అతన్ని సిరీస్ నుంచి తప్పించారు. పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. జురెల్ విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాడు.
7 మ్యాచ్‌లలో 558 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏ క్రికెట్‌లో 74కు పైగా సగటుతో గత కొంతకాలంగా నూ నిలకడగా రాణిస్తున్నాడు. కీపర్‌గా మిగిలిన ఆటగాళ్లతో పోలి స్తే మొదటి ప్రాధాన్యతగా దూ సుకొస్తున్నాడు. ఇప్పుడు పంత్ గాయపడడంతో జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గచూపారు. అయి తే తుది జట్టులో జురెల్ కు చోటు దక్కడం డౌటే.