ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి
- నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఏల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్‌లోని తన నివాసంలో బుధవారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి దేవుళ్ల సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల గెలిచి సీఎం అయ్యాక ఇప్పుడు రుణమాఫీ గురించి అడిగితే ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే బీజేపీ రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం దశల వారీగా రుణమాఫీ చేద్దామని యోచిస్తుందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో కేటాయిం పుల్లో ఎక్కడా రుణమాఫీ ప్రస్తావన లేకుండా చూస్తోందని, అదే జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.






