కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన గ్రామీణాభివృద్ధి అధికారి
30-05-2026 12:00 AM
గాంధారి, మే 29 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బ్రాహ్మణపల్లి ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్ రెడ్డి పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తూకం వేగవంతం చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు.. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం సిబ్బంది లారీల కొరత పై ఆయన దృష్టికి తీసుకొచ్చారు. లారీలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ బిస గణేష్, ఏపీఎం ప్రసన్న కుమార్, సీసీ సౌజన్య, రైతులు పాల్గొన్నారు.






