కాలుష్య సమస్యను పరిష్కరించండి
- మంత్రి దామోదరకు ఖాజీపల్లి గ్రామస్థుల వినతి
పటాన్‌చెరు, జూలై 1: కాలుష్య సమస్య ను తీర్చాలని ఖాజీపల్లి గ్రామస్థులు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ఖాజీపల్లి, గడ్డపోతా రం, కిష్టయ్యపల్లి, అల్లీనగర్, గండిగూడెం గ్రామాల్లో ప్రజల ఆయురారోగ్యాలను హరిస్తున్న పరిశ్రమలను నివాస ప్రాంతాల నుం చి తరలించాలని మంత్రిని కోరినట్లు ప్రముఖ న్యాయవాది, పర్యావరణవేత్త దండే రమాకాంత్ తెలిపారు. ఈ మేరకు గ్రామ జేఏసీ నాయకులతో మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
నిబంధనలు పాటించకుండా రసాయన వ్యర్థాలను పరిశ్రమలు వదులుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, ఐదు గ్రామాల్లో వెంటనే హెల్త్ ఎమ ర్జెన్సీని ప్రకటించాలని కోరారు. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని, మంజీర త్రాగునీరు గ్రామాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీసీబీ చీఫ్ ఇంజనీర్ రఘును కలిసి కాలుష్య పరిశ్రమలపై ఫిర్యా దు చేయగా, వెంటనే ఆయా కంపెనీలకు నోటీసులు ఇస్తామన్నారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రయీస్, కుమార్‌యాదవ్, మహేశ్, హుస్సేన్, సురేశ్ పాల్గొన్నారు.






