16 July, 2026 | 2:10 AM

ఆసియా ట్రయథ్లాన్ పోటీలకు ధృతి

23-04-2024 01:08 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ ధృతి.. ఆసియా ట్రయథ్లాన్ కప్‌నకు ఎంపికైంది. నేపాల్ వేదికగా ఈ నెల 27 నుంచి జరగనున్న ఈ మెగాటోర్నీలో ధృతి దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఆసియా ట్రయథ్లాన్ కప్‌తో పాటు దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లోనూ ధృతి బరిలోకి దిగనుంది. స్విమ్మింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ధృతి ఈతకొలనులో లెక్కకు మిక్కిలి రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన అనంతరం.. ట్రయథ్లాన్ వైపు మళ్లింది. స్విమ్మింగ్, సైక్లింక్, రన్నింగ్ కలగలిసిన ఈ పోటీ అథ్లెట్ శారీరక సామర్థ్యానికి అతి పెద్ద పరీక్ష అని ధృతి పేర్కొంది. ‘అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నా.. ట్రయథ్లాన్‌పై మక్కువ పెంచుకోవడంలో కోచ్‌లు ఆయుష్ యాదవ్, గోకుల్ కృష్ణ పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతానికి ఆసియా ట్రయథ్లాన్ కప్‌లో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం’ అని ధృతి చెప్పుకొచ్చింది.