16 July, 2026 | 2:03 AM

చెన్నై X లక్నో

23-04-2024 01:09 AM

చెన్నై: లక్నో సూపర్ జెయిం ట్స్ చేతిలో ఎదురైన పరాభవాని కి సొంతగడ్డపై బదులు తీర్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సమాయత్తమవుతోంది. మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై, లక్నోలు తలపడనున్నాయి. గత వారం లక్నో వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు డికాక్ మెరుపులతో.. లక్నో సులువుగా విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై లక్నోను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని చెన్నై భావిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై ఏడు మ్యాచ్‌లాడి 4 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మరోవైపు లక్నో కూడా అన్నే విజయాలతో ఐదో స్థానంలో ఉంది. 

మరి మ్యాచ్‌లో చెన్నై బదులు తీర్చుకుంటుందా లేక లక్నోనే మరోసారి పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం. బ్యాటిం గ్‌లో చెన్నై పటిష్టంగా కనిపిస్తున్నా.. ఓపెనర్ రచిన్ రవీం ద్ర పేలవ్ ఫామ్ ఆ జ ట్టును కలవరపరుస్తోం ది. ఇక కెప్టెన్ రుతురాజ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజాలు మంచి ఫామ్ కనబరుస్తుండగా.. ఆఖర్లో ధోని ఫినిషర్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్, మతీశా పతీరణ కీలకం కానున్నారు. మరోవైపు లక్నో విషయానికి వస్తే.. ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్‌లపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.  ఫినిషర్‌గా వస్తున్న నికోలస్ పూరన్ ఆకట్టుకుంటున్నప్పటికి మిడిలార్డర్‌పెద్దగా రాణించడం లేదు. ఇక బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్‌లు కీలకం కానున్నారు.