ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు
14-12-2024 12:50 AM
కీవ్, డిసెంబర్ 13: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా కీవ్ సహా పలు ప్రాంతాలపై డజన్ల కొద్ది క్రూయిజ్ క్షిపణులు, వైమానిక డ్రోన్లతో దాడులు చేసింది. చలికాలం కావడంతో పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్లను భయపెట్టడానికే రష్యా దాడులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై బాలిస్టిక్ కింజాల్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి హెర్మన్ తెలిపారు. కాగా తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు రష్యా సిద్ధంగా ఉందని రష్యా నుంచి పారిపోయిన ఓ సైనికుడు పేర్కొన్నాడు.






