ఎర్రకోటను అప్పగించండి
* మొఘల్ వారసుల పిటిషన్
* కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఎర్రకోటను తమకు అప్పగించాలని మొఘల్ చక్రవర్తుల వారసులు వేసిన పిటిష న్నుఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రకోటను తమ పూర్వీకులు నిర్మించారని, దానిని తిరిగి తమకు ఇప్పించాలని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ మునిమనవడి భార్య సుల్తానా బేగం 2021లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రెండున్నరేళ్ల తరువాత మళ్లీ కోర్టుకు వెళ్లారు. గతం లో మొఘలుల నుంచి బ్రిటిష్ వారు ఎర్రకోటను తీసుకున్నారని ఆమె పే ర్కొన్నారు. బ్రిటిషర్లు దేశం విడిచి వెళ్లి న తరువాత భారత ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకుందని తెలిపా రు. ఆ కోటను తమకు అప్పగించాల ని.. లేదంటే తమకు తగిన పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ విభు బఖ్రు , జస్టిస్ తుషార్‌రావు ధర్మాసనం విచారించి ఆమె వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. అప్పీల్ చేసుకోవడంలో జరిగిన విపరీత ఆలస్యం కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నది.






