24-04-2025 01:23:49 AM
వివిధ యాత్రలకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్న సంస్థ
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): టూరిజం రంగంలో 25 ఏండ్ల సుదీర్ఘ అనుభవంతో దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థల్లో ఒక్కటిగా నిలిచిన ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కష్టమర్ల తమ సేవలను మరింత విస్తరింపజేసే దిశలో భాగంగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో 6 కొత్త బ్రాంచీలను ప్రారంభించింది.
ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కరీంనగర్, వారాణసిలో సేవలను అందిస్తున్న ఆర్‌వీ సంస్థ, దేశంలోని పట్టణ ప్రాంతాలే కాకుండా మారుమూలన ఉన్న ప్రజలకు సైతం తమ సేవలు అందుబాటులో ఉండేలా కర్నూల్, వరంగల్, ఖమ్మం, భీమవరం, ఒంగోలు, రాజమండ్రి ప్రజలను అనుసంధానం చేస్తూ ఈ నూతన కార్యాలయాలను ప్రారంభించడం గొప్ప శుభ పరిణామమని సంస్థ చైర్మన్ ఆర్‌వీ రమణ పేర్కొన్నారు.
తమ కస్టమర్లనే ముఖ్య అతిథులుగా భావించి కార్యాలయాల్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలిపారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు కాశీ,- అయోధ్య, అమర్‌నాథ్, చార్‌దామ్, ముక్తినాథ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి అనేక దేశీయ యాత్రలతో పాటు దుబాయ్, సింగపూర్, -మలేషియా, కంబోడియా, -వియాత్నం, యూరప్, ఆస్ట్రేలియా, టర్కీ , బాకు వంటి అనేక విదేశీ యాత్రలపై భారీ ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా కాశీ ,-అయోధ్య ౩ నైట్స్ 4 డేస్ విమాన ప్యాకేజీని చక్కటి వసతులతో రూ.21, 999 హైదరాబాద్, బెంగుళూరు నుంచి అందిస్తున్నామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తమ స్థానిక కార్యాలయాలకు వచ్చి యాత్రలను బుక్ చేసుకోవాలని చెప్పారు.