ప్రతి నీటి బొట్టు.. భూమిలో ఇంకేటట్టు
పడిపోతున్న జిల్లాలకు జలసిరితో రక్షణ
ప్రజల భాగస్వామ్యంతో నీటి పొదుపు
కరువుపై ప్రత్యేక దృష్టి
నిర్మల్, కుబీర్, జులై 23 (విజయక్రాంతి): సకల కోటికి జీవనాధారం మీరు. ఆ నీటిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వం జలసిరి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో చేపడుతుంది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎలినో ప్రభావం పరిస్థితులు నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో ఉన్న జిల్లాలోని సంరక్షించుకుంటూ పొదుపుపై ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో జలసిరి కార్యక్రమం ప్రజా ఉద్యమముగా చేపడుతుంది.
నిర్మల్ జిల్లాలో జూన్ జూలై మాసంలో సగటు వర్షపాతంలో 50% లోటు ఏర్పడింది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు సాగునీటి చెరువుల్లో బావుల్లో నీళ్లు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు 7 నుంచి 9 మీటర్ల లోతుకు పడిపోయాయి. సమృద్ధిగా వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు జిల్లాలో మూడు నుంచి ఐదు మీటర్ల లోపు ఉండేవని అధికారులు చెప్తున్నారు
జిల్లా సిరితో పొదుపు మంత్రం
నిర్మల్ జిల్లాలో అడుగంటి పోతున్న భూగర్భ జలాల నేపథ్యంలో ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు, ఎనిమిలో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం భూగర్భ జిల్లాల పరిరక్షణకు జలసిరి కార్యక్రమం. ఇందులో భాగంగా జిల్లాలోని 400 గ్రామపంచాయతీతో పాటు నిర్మల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇంటికి ఒక ఇంకుడు గుంత, ఊరికి ఒక ఊరకుంట, పంట చేనుకు ఒక నీటి గుంట తో పెద్ద ఎత్తున భూగర్భ జలాల పరిరక్షణ పరులు ప్రారంభిస్తుంది.
జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేతిపంపుల వద్ద, ఓహెచ్‌ఎస్‌ఆర్ బ్యాంకుల వద్ద వృధాగా పోతున్న నీరుని భూమిలో ఇంకేటట్టు ప్రజలకు అవగాహన కల్పించి జల పరిరక్షణ పనులను చేపడుతుంది. నీటిపారుదల శాఖ, విద్యుత్ వ్యవసాయం, డి ఆర్ డి ఏ శాఖల సమన్వయంతో జిల్లాలో ఇంకుడు గుంటలు ఊరకుంటలు నీటి కుంటలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రామపంచాయతీలో చేతిపంపుల వద్ద మురికి నీరు వెళ్లే గ్రామం చివర్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటున్నారు. వృధా నీరు భూమిలో దించడం వల్ల భూగర్భ జలాల మట్ట ం పడిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎదురైతే తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ప్రజల భాగస్వామ్యం చేయడానికి పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
నీటి తడి పంటలపై విస్తృత ప్రచారం
నిర్మల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టులు చెరువుల్లో నీటి కొరత భూగర్భ జలాల పడిపోవడం కారణంతో జిల్లాలో కరువు సీజన్ లో రైతులు నీటి తడులు ఎక్కువగా వినియోగించే పంటలను వేసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి పసుపు వరి పంటకు దూరంగా ఉండి ఆరుతటి పంటలు వేసుకోవాలని ఇందులో ఆయిల్ సీడ్ కూరగాయ పంటలు రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ప్రచారం చేస్తుంది.
భూగర్భ జలాల కొరత నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ వాడకం అధికమైనప్పుడు రైతులకు ఇబ్బందులు తప్పవని విద్యుత్ శాఖ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని భూగర్భ జల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి ప్రజల భాగస్వామ్యంతో జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జలసిరిని ప్రారంభించిన కలెక్టర్
కుబీర్ మండలంలోని రూడర్న గిరిజన గ్రామంలో జలసిరి పనులను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా గురువారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ భూమిలో నిర్మించి నీటి కుంట నిర్మాణానికి పూజలు నిర్వహించి రైతుతో కలిసి పనులను ప్రారంభించారు. కుంట నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతు దంపతులను సన్మానం చేశారు. ప్రతి రైతు తన చేనులో నీటి కుంట నిర్మించుకోవాలని ఇంటికో ఇంకుడు గుంత నిర్మించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






