calender_icon.png 16 December, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న వయసులోనే వార్డ్ మెంబర్‌గా గెలిచిన సాయి సింధు

16-12-2025 02:10:39 AM

అభినందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

బెజ్జంకి డిసెంబర్ 15:చిన్న వయసులోనే వార్డు మెంబర్ గెలవడం చాలా సంతోషమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత లో జరిగిన ఎన్నికల్లోసిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రనికి చెందిన బోనగిరి సాయి సింధుజ వార్డ్ నెంబర్ గా విజయం సాధించింది. సోమవారం సాయి సింధుజ (22) క వ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలవగా శాలువా కప్పి అభినందించారు .

ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే వార్డ్ నంబర్ గా గెలవడం చాలా సంతోషమని యువత, మహిళలు రాజకీయాలతో పాటు,అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు , ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వ పథకాలను అందించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.