15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉప సర్పంచ్ ఎన్నికలో ఉద్రిక్తత

16-12-2025 02:11 AM

సీతారాంపురంలో ఎన్నికల అధికారిని గదిలో బంధించిన గ్రామస్థులు

సమాచారం ఇవ్వకుండా ప్రకటించారంటూ ఆరోపణ

కోదాడ, డిసెంబర్ 15: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికలు ఆలస్యం కావడంతో ఉప సర్పంచ్ ఎన్నికను ఆర్‌ఓ నాగరాజు సోమవారంకు వాయిదా వేసినట్లు తెలిపారు. సోమవారం ఎన్నికలో వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఉప సర్పంచ్ పేరు ప్రకటించారని పలువురు కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఆర్వోను నిలదీశారు.

ఈ క్రమంలో అధికారి బయటకు వెళ్లకుండా పంచాయతీ కార్యాలయం గేటుకి తాళం వేశారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పారు. ఇదే విషయమై అధికారులు స్పందిస్తూ ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చి సమయం వరకు వేచి చూశామన్నారు. కానీ ఐదుగురు వార్డు మెంబర్లు మాత్రమే సమయానికి వచ్చారన్నారు.

కోరంకు సరిపడా రావడంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించి అతని పేరును ప్రకటించినట్లు తెలిపారు. ఇచ్చిన సమయం మించిన తర్వాత మిగిలిన ముగ్గురు వార్డు మెంబర్లు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉపసర్పంచ్ ఎన్నిక జరిపారంటూ అభ్యంతరాలను వ్యక్తం చేశారన్నారు.