16-12-2025 09:05:59 AM
హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలకు(Gram Panchayat Election) చివరి ఘట్టం దగ్గర పడింది. మూడోదశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నాడు తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు(Third phase of Gram Panchayat elections) పోలింగ్ జరగనుంది. 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మూడో దశలో 3,752 సర్పంచ్ స్థానాలకు 394, 28,406 వార్డుల్లో 7,916 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల వల్ల 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి విడతలో 67.65 శాతం, రెండో విడతలో 54.98 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తుది విడత ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.