calender_icon.png 16 December, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ బలగాలకు మోదీ సెల్యూట్

16-12-2025 09:23:10 AM

న్యూఢిల్లీ: 1971 యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్‌ను ఓడించిన విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రశంసించారు. విజయ్ దివస్(Vijay Diwas) సందర్భంగా, 1971లో భారతదేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను మనం స్మరించుకుంటాము. వారి స్థిర సంకల్పం,  నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించాయి. మన చరిత్రలో ఒక గర్వించదగిన క్షణాన్ని లిఖించాయి అని మోదీ తెలిపారు. ఈ రోజు వారి శౌర్యానికి నివాళిగా, వారి అసమాన స్ఫూర్తికి గుర్తుగా నిలుస్తుంది. వారి వీరత్వం తరతరాల భారతీయులను ప్రేరేపిస్తూనే ఉంది," అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.