కిరాణ షాపులో మద్యం విక్రయాలు
బెల్ట్ షాపులపై ఎల్బీనగర్ పోలీసుల దాడులు
నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఎల్బీనగర్, జులై 16: కిరాణ షాపులో మ ద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలు సుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఏసీపీ కృష్ణ య్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే... ఎన్టీఆర్ నగర్ లో ఒక కిరాణ షాపులో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.
వైన్స్ షాపుల నుంచి భారీగా మద్యం కొనుగోలు చేసి, కిరాణా షాపుల్లో బెల్ట్ షాపుల తరహాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా దాడుల్లో 256 బీర్లు, 207 క్వార్టర్లు, 56 (90ml) మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పర్మిషన్ లేకుండా లిక్కర్ అమ్మితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. లిక్క ర్ సప్లై చేస్తున్న వైన్స్ షాపులపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. నిందితులపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






