జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
17-07-2026 12:00 AM
ఎమ్మెల్యే నవీన్
జూబ్లీహిల్స్, జూలై 15 (విజయక్రాంతి): జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉం డాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆకాంక్షించారు. షేక్ పేటలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని పూజలను జరిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రథయాత్ర లో చిన్నారులు, భక్తులతో కలిసి పాల్గొనడం పట్ల తన్మయత్వాన్ని వ్యక్తం చేశారు. బలభద్రుడు, సుభద్ర సమేత జగన్నాథుడిని దర్శించ రెండు కన్నులు చాలవన్నారు. జగన్నాథు ని నామస్మరణతో సాగిన రథయాత్ర ఆద్యం తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రథయాత్ర నిర్వాహకుడు భరత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






