22 June, 2026 | 11:35 AM

ఇందూస్ టవర్స్‌లో వోడాఫోన్ వాటా విక్రయం

15-06-2024 12:05 AM

వచ్చే వారం 2.3 బిలియన్ డాలర్ల లావాదేవీ

న్యూఢిల్లీ, జూన్ 14: మొబైల్ టవర్ ఆపరేటింగ్ కంపెనీ ఇందూస్ టవర్స్‌లో వోడాఫోన్ గ్రూప్‌నకు ఉన్న మొత్తం 21.5 శాతం వాటాను వచ్చేవారంలో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నది. ఇందూస్‌లో వోడాఫోన్ గ్రూప్ సంస్థల వద్ద ఉన్న వాటా విలువ 2.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 19,000 కోట్లు) ఉంటుంది. తన వాటా విక్రయానికి డిమాండ్ బలహీనంగా ఉంటే వోడాఫోన్ కొంత తక్కువ వాటాను విక్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాలో బ్రిటన్ దిగ్గజం వొడాఫోన్ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. ఇందూస్ టవర్స్ షేరు శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో రూ.340.75 వద్ద ముగిసింది.