11-11-2025 02:04:21 AM
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): త్వరలోనే విద్యాశాఖ టెట్ నోటి ఫికేషన్‌ను జారీ చేయనుంది. సర్వీసులో ఉ న్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి అందరికీ ఒకే టెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. టీచర్లు, బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు ఒకే టెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీచర్లకు మినహాయింపు కోరుతూ ‘సుప్రీం’లో ఇప్ప టికే ప్రభుత్వం రివ్యూపిటిషన్‌ను వేసింది.