సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శం
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్, జూలై 12 : భారతదేశంలో ఆవిర్భవించిన సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శమని, సనాతన ధర్మం యుగయుగాలుగా మనుగడ సాగిస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బైరామల్ గూడాలోని సువర్ణ భారతి గోశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘భారత్ నేషనలిస్ట్ ఫోరం‘ 3వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మానికి సంబంధించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సమ్మేళనంలో బ్రహ్మశ్రీ పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ, హజీబు శ్రీనివాస రావు, చౌడవరపు కరుణాకర్, కుండకూల యాదయ్య, గౌరవ అధ్యక్షుడు బొడ్ల మల్లికార్జున్, అధ్యక్షుడు ద్యాప రాంబాబు, కార్యదర్శి వంశీకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేష్ గౌడ్, నాయకులు రాజేంద్రప్రసాద్, నరేశ్, గౌని వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






