13 July, 2026 | 1:59 AM

షిర్డీ సాయిబాబాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వ్యతిరేకుల్లారా ఖబర్దార్..

13-07-2026 12:00 AM
  1. శివసాయి సేన రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల రవి కుమార్
  2. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మీద లేనిపోని
  3. ఆరోపణలు చేస్తే  చూస్తూ ఊరుకోం

సికింద్రాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హిందు సమాజమంతా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కి మద్దతుగా నిలుస్తున్నారని శివ సాయి సేన రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవి కుమార్ స్పష్టం చేశారు.కోట్లాది మంది హిందూ భక్తులు కలిగిన ఆరాధ్యదైవం షిరిడి సాయిబాబా పై కొందరు వ్యతిరేకులు అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శివ సాయి సేన రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవికుమార్  తెలియజేశారు.

ఓయూ ఆరట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూబీసీ,ఎస్సీ,ఎస్టీ పీఠాధిపతులుపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఓర్చుకోలేక సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పైన లేనిపోని ఆలోచనలు చేస్తున్నారని,వారి తీరు మార్చుకోకపోతే ఇకపై చూస్తూ ఊరుకోమని,తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

హిందు సమాజమంతా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి కి మద్దతుగా నిలుస్తామని  తెలియజేస్తూ, కొందరికి తొత్తులుగా వ్యవహరిస్తూ, డబ్బులకు ఆశపడి గత సంవత్సర కాలంగా షిరిడి సాయిబాబా పై విష ప్రచారం చేస్తున్నటు వంటి వారు ఇకనైనా తమ బుద్ధి మార్చుకోవాలని,లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయాని శివ సాయి సేన రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవికుమార్ హెచ్చరించారు. ఈ  కార్యక్రమం లో బోయపల్లి లింగస్వామి గౌడ్, వడ్నాల మల్లేష్, యుగెంధర్, రమేష్, అంజి, సృజన్, శ్రీధర్, శ్రీకాంత్, ఆనంద్, హరీష్, మహేష్, సురేష్, సతీష్, విక్రమ్, సైదులు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.