13 April, 2026 | 2:49 AM

వీఆర్‌కే జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

13-04-2026 01:04 AM

కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాలలో కామారెడ్డి విఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించారు.

ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన ఫలితాలలో వి ఆర్ కె కళాశాల విద్యార్థిని ఏ నవోదయ బైపిసి సెకండియర్ 994/1000 ,పి మైథిలి ఎంపీసీ సెకండ్ ఇయర్-993/1000, ఎం అనన్య సీఈసీ సెకండియర్ 982/1000,, ఎం అఖిల ఎం పి హెచ్ డబ్ల్యు సెకండ్ ఇయర్ 987/1000, నాష్ట్ర జమ ఎంపీసీ ఫస్టియర్-466/470, శిరీష బైపీసీ ఫస్ట్ ఇయర్ - 436/440, జోబియా తన్వీర్ బైపీసీ ఫస్ట్ ఇయర్- 435/440,మదీనా CEC I Year -483/500 వీరితోపాటు చాలామంది విద్యార్థులకు 900 కి పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల సీఈవో కరస్పాండెంట్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి అభినందించారు.

ఇంతటి ప్రతిభా కనబరచడానికి దోహదం చేసినటువంటి కళాశాల అధ్యాపకులకు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శంకర్, నరేష్ , డీన్ నవీన్ కుమార్, కోఆర్డినేటర్ దత్తాత్రి రావు, శ్రీధర్, అధ్యాపక బృందం,  విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.