అభివృద్ధి పనులకు రూ.9.15 కోట్లు మంజూరు
- పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
- డిప్యూటీ కమిషనర్ సుధాంష్
మేడ్చల్ అర్బన్, జూలై 23(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ సర్కిల్ లోని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9.15 కోట్లు మంజూరైనట్లు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ తెలిపారు. మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్,గుండ్లపోచంపల్లి వార్డుల పరిధిలో ని అంతర్గత వీధులు,ప్రధాన రహదారుల్లో బి.టి సీసీ,రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధా న్యం ఇవ్వనున్నమని తెలిపారు.
గుండ్లపోచంపల్లి వద్ద ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి కంపెనీ వరకు రహదారి వెడల్పు పనులకు 35 లక్షలు,మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం నుండి తుమ్మ చెరువు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, పూడూరు-కిష్టాపూర్ పరిధిలోని కేఎల్‌ఆర్ జంక్షన్ డెవలప్మెంట్కు రూ.45 లక్షలు కేటాయించినట్లు డిప్యూటీ కమిషనర్ సుధాంష్ వెల్లడించారు.
వర్షాకాలం దృష్ట్యా నాలాల ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేసేందుకు మూడు వార్డుల పరిధిలో నాళాల్లో పూడికతీత పనులకు, గుండ్లపోచంపల్లి అపేరల్ పార్క్ ప్రైడ్ వసిష్ఠ రెసిడెన్సీ నుండి అపెరల్ పార్క్ వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.26.70 లక్షలు కేటాయించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
గుండ్లపోచంపల్లి పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల ఆవరణల్లో కొత్త టాయిలెట్ బా ్లక్ల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నా రు. ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్ వెల్ మోటార్లు,అదేవిధంగా పంప్ సెట్ల మరమ్మతులు,ప్లాస్టిక్ పైప్ లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
పూర్తయిన పనులు ఇప్పటికే 215 లక్షలకు పైగా విలువైన 12 రకాల సీసీ రోడ్లు,డ్రైనేజీ మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తికాగా,.కొనసాగుతున్న పనులు నాలాల పూడికతీత,తాగునీటి పైప్లైన్ రిపేర్లు,పాఠశాలల టాయిలెట్ బ్లాక్ ల నిర్మాణం,ఓపెన్ నాలాలకు చైన్ లింక్ మెష్ ఏర్పాటు వంటి 15 పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇంకా ప్రారంభిం చాల్సినవి టెండర్ దశలోనివి మిగిలిన 23 పనులు ప్రారంభ దశలో టెండర్ల నిర్వహణ ప్రక్రియలో ఉన్నాయని,స్థానిక నివాసితులు రోడ్లు,డ్రైనేజీ సమస్యలతో పడుతున్న ఇబ్బందులకు ఈ పనులతో శాశ్వత పరిష్కారం ల భిస్తుందని వెల్లడించాయి. పనుల నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా పూర్తిచే యాలని అధికారులు ఆదేశించారు.






