ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 23 (విజయ క్రాంతి) : ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్దిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎ మ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే పరమావధిగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేసి, ఇందిరమ్మ జీవిత భీమా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సహాయ మంత్రి హోదా రావడంతో పలువురు ప్రముఖులు ప్రజలు అత్యధికంగా హాజరై ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనిత, హన్వాడ మండల అధ్యక్షులు మహేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్నయ్య, నాయకులు అనిల్ రెడ్డి, ఫయాజ్, సుధాకర్ రెడ్డి, ఆజ్మత్ అలి, కృష్ణయ్య యాదవ్, కే. తిరుపతయ్య , తులసిరామ్, రామచంద్రయ్య, అవేజ్, ఉమర్ కోత్వాల్, షబ్బీర్ అహ్మద్, అబ్దుల్ హక్, పోతనపల్లి మోహన్ రెడ్డి, గోవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






