calender_icon.png 28 October, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సాంక్టస్’ వారి వరల్డ్ ఫెస్ట్-2025

28-10-2025 12:48:04 AM

హాజరైన ఫిన్లాండ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ ఆఫ్ హాల్స్‌ట్రామ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): బీఎన్‌రెడ్డి బ్రాంచీలోని సాంక్టస్ వరల్ స్కూల్ ప్రాంగణం సోమవారం రంగులు, సృజనాత్మకత, సాంస్కృ తిక వైభవంతో నిండిపోయింది. సేయిలింగ్ త్రో గ్లోబల్ ట్రెడిషన్స్ అనే నినాదంతో నిర్వహించిన సాంక్టస్ వరల్డ్ ఫెస్ట్, సాన్ టాల్క్స్-2025 నిర్వహించారు.  విద్యార్థులు రాజస్థాన్, నాగాలాండ్, కోల్‌కతా, పం జాబ్, బ్రెజిల్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, మెక్సికో, జపాన్, ఇటలీ వంటి ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యాన్ని నృత్యా లు, ప్రదర్శనలు, మోడల్స్, ప్రసంగాల ద్వారా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం ఐక్యతలో వైవిధ్యం అనే భారతీయ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ, విద్యార్థుల్లో ప్రపంచ సంస్కృతుల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంచింది. ఈ వేడుకకు ఫిన్లాండ్ కాన్సుల్ జనరల్ (ముంబై) ఎరిక్ ఆఫ్ హాల్స్‌ట్రామ్ ముఖ్య అ తిథిగా హాజరై, ఫిన్లాండ్లోని ఒప్పి (OPPI) విద్యా విధానం గురించి ప్రసంగం చేశారు. విద్యలో సృజనాత్మకత, మానసిక శ్రేయస్సు మరియు అనుభవాత్మక అభ్యాసం అవసరాన్ని ఆయన వివరించారు.

అనంతరం సాంక్టస్ వరల్ స్కూల్కు ఒప్పి అఫిలియేషన్ సర్టిఫికేట్‌ను అందజేసి, ఆ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాల దిశగా అడుగులు వే స్తోందని అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. సాంక్టస్ వరల్ స్కూల్ విద్యార్థి- కేం ద్రిత బోధన విధానాన్ని అనుసరించి, సృజనాత్మకతను, అనుభూతిని, జీవితాంతం నేర్చుకునే తపనను పెంపొందిస్తోంది. సాన్ టాల్క్స్ కార్యక్రమంలో విద్యార్థులు ‘మన ప్రపంచ పటాన్ని, యువత శక్తిని, భూమిపైనా అదృశ్య పాదముద్రలను ఏఐ ఎలా తిరిగి రాస్తోంది’ వంటి ఆలోచనాత్మక అంశాలపై చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు. 

సాంక్టస్ వరల్డ్ స్కూల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. “మా విద్యార్థుల దృష్టి పరిధిని గ్లోబల్ స్థాయికి విస్తరిం చాలనుకుంటున్నాం. అదే సమయంలో వారు తమ మూలాలను, సంప్రదాయాలను మరచిపోకూడదు. విద్య భూతం, వర్త మానం, భవిష్యత్తును కలిపే వంతెనగా ఉం డాలి” అన్నారు.

అకడమిక్ డైరెక్టర్ డి హారితరెడ్డి విద్యార్థులు పర్యావరణ అవగాహన పెంపొందించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుగుణంగా పచ్చదనాన్ని ప్రోత్సహించే అలవాట్లను అవలంబించాలని సూ చించారు. ప్రిన్సిపాల్ నిషా పర్యాణి మాట్లాడుతూ.. సాంస్కృతిక పరిచయం విద్యా ర్థులను సహానుభూతి గల, విశ్వదృక్పథం కలిగిన గ్లోబల్ పౌరులుగా తీర్చిదిద్దుతుంది అన్నారు.