calender_icon.png 4 November, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెజాన్‌లో 30 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

29-10-2025 12:38:16 AM

-సంస్థ పరిధిలో ఇదే అతిపెద్ద తొలగింపు ప్రక్రియ

-హెచ్‌ఆర్, డివైసెస్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాలపై ప్రభావం

-చివరిసారి 2022లో 27 వేల మంది ఉద్యోగాల తొలగింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఈ -కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. సంస్థ పరిధిలో పనిచేస్తున్న 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులకు మంగళవారం ఉద్వాసన పలికింది. అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ పరిమితమైన మానవ వనరులతో సంస్థ కార్యకలాపాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందు కు ఆయన ప్రత్యేకంగా ఒక అంతర్గత బృం దాన్ని ఏర్పాటు చేసి, బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా ‘లేఆఫ్స్’ నిర్ణయం తీసుకు న్నారు.

బ్లూమ్‌బర్గ్, రాయిటర్స్ అంతర్జాతీ య వార్తా సంస్థల కథనం ప్రకారం.. అమెజాన్ కంపెనీ కరోనా సమయం నుంచి ఒడి దుడుకులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే సంస్థ భారీగా ఖర్చులను తగ్గించు కోవాలని నిర్ణయించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలకాలనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంస్థ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా 15.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కార్పొరేట్ ఉద్యోగులు సుమారు 3.5 లక్షల మంది. వీరిలో 10 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని భావించింది.

పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ (మానవ వనరులు), డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని సమాచారం. ఒక్క హెచ్‌ఆర్ విభాగంలోనే దాదాపు 15 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల మేనేజర్లు, మానవ వనరు ల విభాగాధిపతులు సోమవారమే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఉద్వాసనకు ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ ద్వారా సమాచారం చేరవేసిందని తెలిసింది.

సంస్థ తన పునరావృత పనులకు ఇక ఆర్టీఫిషియల్ ఇం టెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగించేందు కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చివరిసా రి 2022లో ఒకేసారి డివైసెస్, కమ్యూనికేషన్స్, పాడ్‌కాస్టింగ్, ఇతర చిన్న బృందాల్లో పనిచేస్తున్న సుమారు 27,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తర్వాత సంస్థ అంతకుమించి 30 వేల మందిని ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 216 కంపెనీలు సుమారు 98,000 మంది ఉద్యోగులను తొలగించా యి. 2024లో ఈ సంఖ్య 1.53 లక్షలు.