8 May, 2026 | 1:03 AM

ఇసుక డంపులు సీజ్

08-05-2026 12:00 AM

పెంట్లవెల్లి మే 7జటప్రోలు గ్రామంలోని కృష్ణా నది తీర ప్రాంతంలో అక్రమ ఇసుక దందాపై గురువారం విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన వార్త కథనం నేపథ్యంలో మైనింగ్ అధికారులు స్పందించారు.  జటప్రోలు గ్రామ పరిసరాల్లోని కృష్ణ తీర ప్రాంతంలో  గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక రీచ్లను పరిశీలించి అనుమతి లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు జరిపి సేకరించిన ఇసుక డంపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగ చైతన్య వివరాలు సేకరించారు. ఆన్లైన్లో నమోదైన జీపీఎస్ వాహనాల ద్వారానే ఇసుక తరలించాలని, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారితో పాటు మైనింగ్ అధికారులు, జటప్రోలు జీపీవో రజిత పాల్గొన్నారు.