ఇసుక పారదర్శకంగా సరఫరా చేయాలి
కలెక్టర్ కె. హరిత ఆదేశం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 30(విజయ క్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’ వ్బుసైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారు లు tgmiv.cgg.gov.in వ్బుసైట్ లేదా ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ఇసుక బుక్ చేసుకుని దళారుల జోక్యం లేకుండా నేరుగా పొందవచ్చన్నారు.
ట్రాక్టర్‌కు 775 చెల్లించి ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక అందజేస్తామని, అవసరమైన చోట రవాణా సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో నూతన ఇసుక విధానం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, టీజీఎండీసీ అధికారి వెంకటేశ్వర్లు, భూగర్భ గనుల శాఖ ఏ.డి. గంగాధర్, భూగర్భ జల శాఖ ఏ.డి. సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు, వయోవృద్ధులు , ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో టాన్స్‌జెండర్ ర్ వ్యక్తుల ఆర్థిక పునరావాస పథకం కింద సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కలెక్టర్ హరిత లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. అడేపు బాస్కర్, సెక్షన్ ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ రవి పసునుంటి తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఇండ్ల గణన
రాష్ట్రంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, చార్జ్ అధికారులు, టెక్నికల్ ఇన్చార్జ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లా అదనపు కలెక్టర్ (డేవిడ్, ఆర్డీఓ లోకేశ్వర్ రావు పాల్గొన్నారు. జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, జనగణన కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. త్వరలో మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు మూడు రోజుల శిక్షణ అందిస్తామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, ఉప గణాంక అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లా పేరు నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా యువజన క్రీడల అధికారి అష్పాక్ అహ్మద్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి మడావి శేఖు, పీజీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ప్రజా వాణిలో వచ్చే ధరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమా వేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏం. డేవిడ్, ఆర్డీఓ లోకేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్నారు.
ఏప్రిల్ 2న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించే గ్రామ సభలకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించాలని, సభలో వచ్చే ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని తెలిపారు.




