13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

31-03-2026 12:00 AM

కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి):  దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ‘జనగణన నుంచి జన కల్యాణం‘ అనే నినాదంతో ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

స్థానిక టీటీడీసీ లో శనివారం ప్రారంభమై సోమవారం తో ముగిసిన ‘సెన్సస్-2027’ ఫీల్ ట్రైనర్ల 3 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో కలెక్టర్ పాల్గొని ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్రా, పర్యవేక్షకులు నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి బాబు, యువరాజ్, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.