calender_icon.png 27 November, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

27-11-2025 12:41:25 AM

అడ్డుకున్న గ్రామస్తులు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మాగనూరు, నవంబర్ 26: నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు నుంచి బుధవారం అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను గ్రామస్తులు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి  అడ్డుకున్నారు.  ఇసుక రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి పత్రాలు చూపాలని డ్రైవర్ను కోరారు. ఎందుకు డ్రైవరు అనుమతి పత్రాలు లేవని తెలుపడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పోలీసులకు ఫోన్ ద్వారా అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పోలీస్ స్టేషన్ కు తరలించాలని రైతులు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

పోలీసుల నుంచి సరియైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడగా మాగనూరు పెద్ద వాగు నుండి ఇసుక తరలింపుకు ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది తెలిపినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో నాయకులు పట్టపగలే అక్రమ ఇసుక రవాణా జరుపుతున్న ఎమ్మార్వో గాని, ఆర్‌ఐకిగాని, పోలీసుల గాని తెలియక పోవడం ఆశ్చర్యకరమని పైగా వారి దగ్గరుండి టిప్పర్ ద్వారా ఆక్రమ ఇసుకను రవాణా చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని విమర్శించారు.

రానున్న రోజుల్లో పెద్దవాగు పట్టిపోయి సమీప పొలాలన్నీ ఎండిపోయి రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన చూస్తూ ఊరుకోవాలని, అధికారం ఒత్తులు నాయకులు ఇంకెన్నాళ్లు ఈ ప్రకృతి విధ్వంసాలకు పాల్పడుతున్నారని వారు తీవ్రంగా అగ్రం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పుంజునూరు ఆంజనేయులు, పుంజనూరు బాలు, అశోక్ గౌడు, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి,పి. మారెప్ప, రైతుల తదితరులు పాల్గొన్నారు.