08-08-2025 12:00:00 AM
మైనింగ్ శాఖ ఎండీభవేష్ మిశ్రా మిర్యాలగూడలో సాండ్ బజార్ ప్రారంభం
మిర్యాలగూడ. ఆగస్టు 7 (విజయక్రాంతి):- ఇసుక అక్రమ దందాని అరికట్టి, నిర్దరిత ధరలకు ఇసుక అందుబాటులో ఉంచేందుకే మిర్యాలగూడలో సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండి, వైస్ చైర్మన్ భవేష్ మిశ్రా అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవతో గురువారం పట్టణంలో ని చింతపల్లి క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భవేష్ మిశ్రా మాట్లాడుతూ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సౌకర్యం నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో సాండ్ బజారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొదటి సాండ్ బజారుని మిర్యాలగూడలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న మిశ్రా సామాన్యులకు అందుబాటు ధరలో టన్ను ఇసుక కేవలం రూ.1250లకే విక్రహిస్తున్నట్లు తెలిపారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్దరిత ధర కన్నా తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సొంతయింటి కల సాకారం చేయడం కోసం తక్కువ ధరకు ఇసుకతో పాటు, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చించి ఒక్కో సిమెంట్ బస్తాపై రూ. 50 డిస్కౌంట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇటుకలు సైతం మార్కెట్ ధర కన్నా ఒక రూపాయి తక్కువకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జాకోబ్, తహసిల్దార్ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హరి బాబు. ఎంపీడీవోలు శేషగిరి శర్మ.మాతంగి రమేష్. డి ఈ వెంకన్న. డిటి రజనీకాంత్. ఆర్ ఐ లు ఠాగూర్ రామకృష్ణ. కృష్ణయ్య సత్యనారాయణ.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి. తాజా కౌన్సిలర్లు శేఖర్ రెడ్డి. నర్సిరెడ్డి. జానీ. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్. 25 వ వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి. వార్డు ఇన్చార్జులు పొదిల వెంకన్న యాదవ్. నాగునాయక్. అబ్దుల్లా. యూత్ నియోజకవర్గ అధ్యక్షులు అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.