08-08-2025 12:00:00 AM
చేనేత సహకార సంఘం సూర్యాపేట అద్యక్షులు కడారి భిక్షం
సూర్యాపేట ఆగస్టు 7 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరిస్తూ నేతన్నలకు ఉపాధి కల్పించాలని చేనేత సహకార సంఘం సూర్యాపేట అద్యక్షులు కడారి భిక్షం అన్నారు. చేనేత సహకార సంఘం సూర్యాపేట ఆధ్వర్యంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కడారి బిక్షం చేనేత జెండాను ఎగరవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జియో ట్యాగింగ్ నెంబర్లు ఇవ్వాలన్నారు. చేనేత భరోసా కార్యక్రమం అర్హులైన అందరికి ఇవ్వాలని చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. చేనేతసహకార సంఘం కోశాధికారి బాలెం ఎల్లయ్య, ఎలగాని యాదగిరి, ముషం వెంకట నారాయణ, గండూరి రమేష్, రాపోలు గిరీష్, జుంక నరసయ్య పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.