బుద్ధ భగవానుని జ్ఞానబోధ సదా ఆచరణీయం
01-05-2026 10:35 AM
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్: పవిత్రమైన “బుద్ధ పూర్ణిమ”(Buddha Purnima 2026) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, దయ, సహనం, శాంతి మార్గాలను బుద్ధ భగవానుడు మానవాళికి అందించిన అమూల్యమైన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ పవిత్రమైన రోజున మనమందరం సమ్యక్ జీవనం, శాంతి మార్గం ఎంచుకుని ముందుకు నడవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.






