13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గురుకుల ఫలితాల్లో ‘సాందీప’ ప్రభంజనం

28-03-2026 12:20 AM

చిన్నచింతకుంట, మార్చి 27 : మండల కేంద్రంలో గల సాందీప పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఫలితంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి గురుకులాల్లో సీట్లు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు.

విద్యార్థుల విజయ పరంపరపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్  కె. కాంతయ్య మాట్లాడుతూ.. ‘విద్యార్థుల కఠిన శ్రమ, ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే సాందీప పాఠశాల లక్ష్యం‘ అని పేర్కొన్నారు.మొదటి విడత పరీక్ష ఫలితాల్లో 22 సీట్లు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.