08-12-2025 05:36:45 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప స్వాములకు రైస్ మిల్ వ్యాపారులు నాగమల్ల సంధ్యా ప్రశాంత్, ఐతు జ్యోతిర్మయి శిరీష్ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మిట్టపల్లి మురళీధర్ ఆ దంపతులకు అయ్యప్ప స్వామి శేష వస్త్రం, మెమొంటో అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ సాయిరీ పద్మ మహేందర్ దంపతులతో పాటు రైస్ మిల్లర్స్ వ్యాపారవేత్త జైపాల్ రెడ్డి, మెరుగు వెంకటేశం, వేగోళం శంకర్ పలువురు ఉన్నారు.