13 August, 2026 | 3:44 AM

స్నేహిత హిల్స్‌లో పడగ విప్పిన పారిశుద్ధ్యం

13-08-2026 01:53 AM
  1. మరుగుదొడ్ల వ్యర్ధాలతో కాలనీ అంతా కంపు కంపు... 
  2. గాడ నిద్రలో రాజేంద్రనగర్ సర్కిల్ పారిశుద్ధ్య వ్యవస్థ.. 
  3. ఫెబిల్ సిటీ  రోడ్డుపై వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే..
  4. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సర్కిల్  అధికారుల నిర్లక్ష్యం

రాజేంద్రనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని స్నేహిత హిల్స్ లో పారిశుధ్యం పడగవిప్పింది . అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంకులలో పారాల్సిన మరుగుదొడ్ల వ్యర్ధాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో స్నేహిత హిల్స్ తో పాటు ఫెబల్ సిటీ కాళీ మందిర్ వెళ్లే రోడ్లు మరుగుదొడ్ల వ్యర్ధాలు మురుగునీటి కంపును కాలనీ వాసులు బాట సారులు భరించలేకపోతున్నారు .  స్నేహిత  హిల్స్ ఫేస్ - 1. ఫేస్ - 2 కాలనీ ల నుండి   అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో వచ్చే వ్యర్ధాలు ..

పిస్తా హౌస్ వెనక భాగంలో ఉన్న డ్రైనేజీ దగ్గర జామ్ కావడంతో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నుండి వచ్చే వ్యర్ధాలు  మురుగునీరు భారీ మొత్తంలో రోడ్లపైకి రావడంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుంది . దీంతో స్నేహిత హిల్స్ మరియు ఫెబిల్ సిటీ కి వెళ్లే సిసి రోడ్డుపై పెద్ద ఎత్తున మురుగు నీరు చేరి రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులు ఈ దుర్వాసనను భరించలేకపోతున్నారు . ఇంత పెద్ద మొత్తంలో పరిశుద్ధం వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనప్పటికీ రాజేంద్రనగర్ సర్కిల్ పారిశుద్ధ్య అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం

వారి నిర్లక్ష్యానికి ఈ సంఘటన ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు . ఈ వ్యర్ధాలు ఇలాగే రోడ్లపై ప్రవహిస్తే కలరా మలేరియా వంటి వ్యాధులతో ప్రజల ప్రాణాలకె ప్రమాదం పొంచి ఉన్నదనీ కాలని వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఫెబల్ సిటీ . స్నేహిత హిల్స్ కాలనీలకు పిస్తా హౌస్ ల దగ్గరకు వెళ్లాలంటే ఇక ముక్కు మూసుకుని పరిగెత్తాల్సిన పరిస్థితి ఉన్నదని . ఈ అమానవీయ ఘటనపై రాజేంద్రనగర్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యాన్ని కాలనీ వాసులు తిట్లతో శాపనార్థాలతో కడిగిపారేస్తున్నారు ..

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..

స్నేహిత హిల్స్ లో మరుగుదొడ్ల నుండి వస్తున్న మురుగు నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల ప్రజలు మలేరియా డెంగ్యూ ఇతర రోగాల బారిన పద్రవకాశం ఉంది. ఈ వ్యర్ధాలు ప్రజల ప్రాణాలకె ప్రమాదం .. అధికారులు స్పందించి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మరమ్మతు చేయించాలనీ స్నేహిత హిల్స్ కాలనీ వాసి కె కృష్ణ మూర్తి అధికారులను కోరారు..

- కె.కృష్ణమూర్తి, స్నేహిత హిల్స్ కాలనీ వాసి

సమస్యను పరిష్కరిస్తాం..

స్నేహిత హిల్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని  ఎఈ నాగిరెడ్డి చొరవ తీసుకొనే బుధవారం పని పూర్తిచేయాలని రాజేంద్రనగర్ జోనల్ ఎస్ ఈ నరేందర్ గౌడ్ ఎ ఈ నాగి రెడ్డి నీ ఆదేశించారు.

- నరేందర్ గౌడ్, ఎస్‌ఈ