సీపీఐ శతాబ్ది ఉత్సవాలు వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
15-01-2026 01:54 AM
ఆదిలాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారాని ఎర్రజెండా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో బోరజ్ మండల కేంద్రంతో పాటు మండగాడ, కామాయి, పెంటలవాడ, లేఖర్ వాడ, సవాపూర్, బాలాపూర్, నీలారా, తర్ణం లో సీపీఐ పార్టీ 100 సంవత్సర శతాబ్ది ఉత్సవాలు వాల్ పోస్టర్ల బుధవారం నాయకులు విడుదల చేశారు.
గ్రామ గ్రామాన కరపత్రాలు పంపిణీ చేసి, ఖమ్మంలో ఈనెల 18న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కుంటాల రాములు, గడ్డం భూపతి రెడ్డి, మెహబూబ్ ఖాన్, గణేష్, చిన్నయ్య, సుంకరి దాసు, ఇందూరు నర్సింగ్, బన్సీ లాల్ సామ సోమన్నపాల్గొన్నారు.




