14-01-2026 02:40:48 AM
పెండ్యాలలో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): స్వామి వివేకానంద జయంతిని పు రస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో నిర్వహించిన 25వ సిల్వర్ జూబ్లీ స్వామి వివేకానంద కబడ్డీ చాలెంజ్ టోర్నమెంట్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మా ట్లాడుతూ.. భారతదేశానికి అపారమైన యు వశక్తి ఉందని, ఆ యువశక్తే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే ప్రధాన శక్తిగా మారనుందని పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు, జాతీ య కిసాన్ మోర్చా సభ్యులు పాపయ్యగౌ డ్, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు యాదిష్, మాజీ ఎంపీపీ కుండె వెంకటేష్, సర్పంచ్ జగ్గిరెడ్డి, టోర్నమెంట్ ఫౌండర్ విష్ణువర్ధన్, జిల్లా కార్యదర్శి యాద య్య గౌడ్, సీనియర్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, గిరిజన మోర్చా నాయకులు దేశ్యా నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు వనంపల్లి శ్రవణ్, ఉపేందర్ పాల్గొన్నారు.